కేసీఆర్.. ఉత్తరాది రాష్ట్రాల పల్స్ పట్టేశారా?
రైతులతోనే అభివృద్ధి సాధ్యమనే పాయింట్ తో జనాల్లోకి వెళ్లేందుకు చూస్తున్నారు. పార్టీ అనుబంధ రైతు సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితిని ప్రకటించారు. దానికి ప్రెసిడెంట్ గా హర్యానాకు చెందిన రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ తో తొలి సంతకం చేయించారు. మరోవైపు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులే అధికంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. వ్యవసాయ రంగమే తమ ప్రాధాన్యం అని ఉత్తరాది రాష్ట్రాలను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు కేసీఆర్.