తెలంగాణకు మోదీ వస్తుంటే.. ఏంటీ అపశకునం?

Chakravarthi Kalyan
ఇవాళ తెలంగాణకు ప్రధాని మోదీ వస్తున్నారు. రామగుండం ఫర్టిలైజర్స్ పరిశ్రమను జాతికి అంకితం చేయనున్నారు. అయితే.. ప్రధాని వచ్చే సమయంలో ఓ అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రధాని జాతికి అంకితం చేయనున్న రామగుండం ఫర్టిలైజర్స్ పరిశ్రమ యూనిట్లోలో యూరియా ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు.
ఎందుకంటే.. లిక్విడ్ అమోనియం ప్లాంట్ నుంచి యూరియా యూనిట్ కు అమ్మోనియా సరఫరా చేసే పైప్ లైన్ లీకేజీ ఏర్పడింది. దీని మరమ్మతుకు అధికారులు ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు. అమ్మోనియా పైపులైను మరమ్మత్తు కోసం రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి పూర్తిగా నిలిపివేసి అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. ప్రధాని వస్తున్న సమయంలో ఇలా జరగడంతో అధికారులు హైరానా పడుతున్నారు. ప్రధాని వచ్చే సమయం కల్లా ఎలాగైనా ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: