కేసీఆర్‌ సేఫ్‌.. నితీశ్‌కు ప్రధాని పదవిపై కోరిక లేదట..?

Chakravarthi Kalyan
వచ్చే ఎన్నికలకు విపక్షాలను ఏకం చేసే పనిలో బీహార్ సీఎం నితీష్‌ కుమార్ ఉన్నారు. ఈ దిశగా ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక నేతలను కలుస్తున్నారు. ఇటీవలే కేసీఆర్, నితీశ్ కుమార్ కూడా పాట్నాలో కలుసుకుని సుదీర్ఘంగా చర్చించారు. అయితే.. కాంగ్రెసేతర, బీజేపీయేతర ఈ కూటమికి నాయకుడు ఎవరు.. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే నితీశ్ కుమార్ మాత్రం.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని పదవి రేసులో కానీ ఆ పదవిపై కోరిక కానీ తనకు లేదని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ అంటున్నారు.


విపక్షాలను ఐక్యం చేసేందుకు దిల్లీలో పర్యటించిన నితీశ్ కుమార్ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. ఆ తర్వాత ఇతర వామపక్ష నేతలను కలిశారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కూడా  భేటీ అయ్యారు. గతనెల ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న తర్వాత తొలిసారి హస్తినలో పర్యటించిన నితీశ్‌ కుమార్‌ వివిధపార్టీలకు చెందిన నేతలతో వరుసగా సమావేశమయ్యారు. కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలతోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని నితీశ్ అంటున్నారు. ఆయన ఐఎన్‌ఎల్‌డీ చీఫ్‌ ఓంప్రకాశ్‌ చౌతాలా, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, ఆయన కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌తోనూ సమావేశం అయ్యారు. ప్రతిపక్షాలను ఏకం చేయటమే తన పని అంటున్న నితీశ్‌ కుమార్‌ ఎంత వరకూ సక్సస్ అవుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: