జగన్‌కు సొంత జిల్లాపై మరీ ఇంత ప్రేమా?

Chakravarthi Kalyan
ఏ నాయకుడికైనా సొంత ప్రాంతంపై మమకారం ఉంటుంది. అందుకు వైఎస్ జగన్ కూడా మినహాయింపు ఏమీ కాదు.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా తమ సొంత ప్రాంతంపై మమకారం చంపుకోలేని నాయకులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు జగన్ కూడా అదే కోవలోకి చెందుతారు. ఎందుకంటే.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి.
అయితే.. ఇలా వచ్చే వాటిలో చాలా వరకూ వైఎస్సార్ కడప జిల్లాలోనే ఫ్యాక్టరీ పెడతామని ప్రతిపాదించడం విశేషం. రాష్ట్రంలో మొత్తం 81 వేల కోట్ల విలువైన పెట్టుబడులు రానుండగా వాటిలో ఎక్కువ వరకూ కడప జిల్లాలోనే నెలకొల్పబోతున్నారు. వైయస్సార్‌జిల్లా కొప్పర్తిలో కాసిస్‌ ఇ–మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రూ. 386.23 కోట్ల పెట్టుబడితో కంపెనీ పె‌ట్టబోతోంది. ఇందులో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీకోసం రూ. 286.23 కోట్లు, ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. తొలివిడతలో వేయి ఎలక్ట్రిక్‌ బస్సులు తయారుచేయాలని లక్ష్యం కాగా.. దీనివల్ల 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: