ఫారిన్‌ వెళ్తున్నారా.. మీకో గుడ్ న్యూస్‌!

Chakravarthi Kalyan
చదువు కోసమో, ఉద్యోగం కోసమో.. పర్యాటకం కోసమో.. విదేశాలకు వెళ్లడం సాధారణంగా మారింది. అయితే.. అలా వెళ్లే వాళ్లకు పాస్‌పోర్టులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్‌పోర్టులు అందించే కార్యాలయాలకు సాధారణంగా శని, ఆది వారాలు సెలవులు ఉంటాయి. అందువల్ల పాస్‌ పోర్టుల జారీ కాస్త ఆలస్యం అవుతుంటుంది. కానీ ఇక నుంచి శని వారాల్లో కూడా పాస్‌పోర్టు కేంద్రాలు పని చేస్తాయట.. ఆ రోజు కూడా సేవలు అందించనున్నాయట.  హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఈ విషయం మీడియాకు తెలిపారు.


ఇప్పుడు వారంలో ఐదు రోజులు మాత్రమే పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేస్తున్నాయని.. దీనివల్ల విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న వారు సమస్యను ఎదుర్కొంటున్నారని.. వారి దరఖాస్తుల పరిష్కారం కోసం మూడు వారాలకు పైగా సమయం పడుతోందని బాలయ్య వివరించారు. ఈ సమస్యను వీసా, పాస్‌పోర్టు విదేశీ మంత్రిత్వశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా.. ఆన శని వారం కూడా పాస్‌పోర్టు సేవా కేంద్రాలు కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని.. బాలయ్య తెలిపారు. అందుకే వచ్చే శని వారం నుంచి హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం సర్కిల్‌లోని టోలీచౌకీ, బేగంపేట, అమీర్‌పేట, నిజామాబాద్‌, కరీంనగర్‌లోని పాస్‌పోర్టు కేంద్రాలు కూడా శని వారం పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: