మరో లగడపాటి బయలుదేరాడండోయ్‌?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో మరో లగడపాటి బయలు దేరాడు.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరు చెప్పగానే గుర్తొచ్చిది ముందు ఎన్నికల సర్వేలే.. ఆయన గతంలో తన వద్ద ఉన్న టీమ్‌తో రాజకీయంగా ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారో సర్వేలు చేయించేవారు.. ఎన్నికల ముందు తన సర్వే ఫలితాలు వెల్లడించేవాడు.. మొదట్లో చాలా వరకూ ఆయన సర్వేలు నిజం అయ్యాయి. దీంతో ఆయనకు ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు వచ్చేసింది.


కానీ.. 2018లో తెలంగాణలో మహా కూటమి విజయం సాధిస్తుందని ఆయన చెప్పే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అప్పట్లో లగడపాటి సర్వేను నమ్ముకుని మహాకూటమి నేతలంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ.. తీరా ఫలితాలు చూశాక అంతా రివర్స్ అయ్యింది. దీంతో ఆయన సర్వేలు మానేశారు. ఇక ఇప్పుడు లగపాటి లేని లోటును వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భర్తీ చేస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తప్పకుండా గెలుస్తుందంటూ తన సర్వే ఫలితాలు వెల్లడించారు. మరి ఈయన ఫలితాలు ఎంత వరకూ నిజం అవుతాయో?

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: