సీక్రెట్ ఔట్: జయలలిత మరణంపై రిపోర్ట్ వచ్చేసింది?
అపోలో ఆస్పత్రిలో చేరకముందే జయలలితకు థైరాయిడ్, బీపీ, షుగర్ మొదలైన పలు అనారోగ్య సమస్యలున్నాయని, ఆస్పత్రిలో చికిత్స సమయంలో ఆమె ద్రాక్ష, కేక్, స్వీట్లు తినడంతో సెప్టెంబరు 28న ఆరోగ్యం క్షీణించి ఊపిరితిత్తుల సమస్య తలెత్తినట్లు తెలిపింది. దీంతో అక్టోబరు 7వ తేదీ ట్రాకియోస్టమీ చికిత్స ప్రారంభించారని, అక్టోబరు 14 నుంచి లండన్ వైద్యుడు రిచర్డ్ బిలే, అపోలో ప్రత్యేక వైద్యులు, ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందించారని పేర్కొంది. డిసెంబరు 3వ తేదీన ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి, 4వ తేదీ శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని, ఎక్మో ఏర్పాటుచేసి 24 గంటలు పర్యవేక్షించారని వెల్లడించింది. 5వ తేదీ మెదడు, గుండె పనిచేయలేదని వైద్యులు నిర్ధారించినట్లు వివరించింది. ఆమెకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలు లేవని నివేదికలో పేర్కొంది.