మంకీపాక్స్: ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు?
ఎందుకంటే.. మంకీ పాక్స్ టీకాలు 100 శాతం ప్రభావం చూపుతాయని ఆశించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుకే తగిన జాగ్రత్తలు పాటించే విషయంలో అలసత్వం పాటించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే 92 దేశాలకు మంకీ పాక్స్ వైరస్ విస్తరించింది. ఇప్పటి వరకూ దాదాపు 35 వేల మంది వైరస్ బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 12 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.