ఏపీలో పంద్రాగస్టు వేడుకలు.. జగన్ ఏంచేస్తారంటే?

Chakravarthi Kalyan
విజయవాడలో రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఈ ఉదయం 9 గంటలకు స్వాతంత్య్ర వేడుకలు ప్రారంభం అవుతాయి. సీఎం జగన్..  జాతీయ జెండాను  ఎగురవేయనున్నారు. అనంతరం సీఎం జగన్ సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు.

పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను అధికారులు సిద్దం చేశారు. ఈ వేడుక  తర్వాత సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తేనీటి విందు  ఇవ్వనున్నారు. ఈ విందు ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: