బాబోయ్.. చైనా నుంచి మరో కొత్త వైరస్‌?

Chakravarthi Kalyan
ఇప్పటికే ప్రపంచానికి కరోనా వైరస్‌ ను ప్రసాదించిన చైనా ఇప్పుడు మరో కొత్త వైరస్‌ ను అందించిందన్న వార్త భయం గొలుపుతోంది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపా వైరస్‌ ఇప్పుడు చైనాలో మనుషులకు వ్యాపించిందట.  షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రాంతాల్లో ఈ హెనిపా వైరస్‌ కొందరికి వ్యాపించిందట. ఈ విషయాన్ని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.
ఇది కొత్త రకం హెనిపావైరస్‌ అని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. ఈ కొత్త వైరస్‌కు  లాంగ్యా హెనిపావైరస్‌ అని పేరు పెట్టారు. ఇది చాలా డేంజరస్ అని తెలుస్తోంది. ఇది సోకితే జ్వరం, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు, వికారంగా ఉండటం, అనోరెక్సియా వంటి లక్షణాలు ఉంటాయి.
హెనిపా వైరస్‌ను బయోసేఫ్టీ లెవల్‌-4 వైరస్‌గా ఆ పత్రిక తెలిపింది. ఇది మనుషుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ కేసుల్లో 40-75శాతం వరకు మరణాలు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా కూడా చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: