ఆ రైతులకు జగన్ సర్కారు శుభవార్త?

Chakravarthi Kalyan
ఆయిల్‌ పామ్‌ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెబుతోంది. ఈ సాగును ప్రోత్సహిస్తున్నఅధికారులు.. రాయితీలు ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లోని పలు జిల్లాల్లో  రైతులు ఆయిల్‌పామ్‌ సాగువైపు మొగ్గుచూపుతున్న  దృష్టా, ఉద్యానశాఖ అధికారులు వారికి రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. సాగుకు సంబంధించి.. ట్రిపులెఫ్ కంపెనీతో  ప్రభుత్వం  ఒప్పందం కుదుర్చుకుంది.

ఆయిల్‌పామ్‌ సాగుచేసే రైతులకు   ప్రభుత్వం హెక్టారుకు 20 వేల రూపాయలు రాయితీని అందిస్తోంది. ఎరువులు, పురుగుమందుల కొనుగోళ్లకు సంబంధించి 4సంవత్సరాల పాటు 21 వేల రూపాయలు అందించనున్నారు. ఆయిల్ పాన్‌ సాగులోఅంతర పంటల సాగుకు సైతం ప్రభుత్వం రాయితీలు అందిస్తుంది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే ప్రస్తుతం 720 హెక్టార్లలో ఆయిల్ పామ్ పంట సాగవుతోంది. ఈ సాగును 5000 హెక్టార్లు వరకు పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: