ఉక్రెయిన్ దెబ్బ.. తోక ముడిచిన రష్యా?
స్నేక్ ఐలాండ్ నుంచి తన బలగాలను ఉపసంహరించుకుంది. రష్యా స్నేక్ ఐలాండ్‌ను వదులుకోవడం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఎందుకంటే స్నేక్ ఐలాండ్ ద్వీపం నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉక్రెయిన్ తీర ప్రాంతాలు, రేవులు ఉంటాయి. స్నేక్ ఐలాండ్ నుంచి ఆ ప్రాంతాలపై దాడులు చేయడం చాలా సులభం. అంతే కాదు... అక్కడ నుంచి నాటో దేశం రొమేనియాపైనా దాడులు చేయొచ్చు. అలాంటిది ఆ ప్రాంతాన్ని రష్యా ఖాళీ చేయడం సంచలనంగా మారింది.