అమరావతి రైతుల పోరాటం ఇంకెన్నాళ్లో?

Chakravarthi Kalyan
ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటం 900 రోజులు దాటిపోయింది.  అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా భవిష్యత్ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు రాజధాని రైతులు చెబుతున్నారు. మరి ఇంకా ఎన్నాళ్లు ఈ ఉద్యమం చేస్తారన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇటీల 900 రోజులైన సందర్భంగా అమరావతిలో ఐకాస ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం, పౌరహక్కుల సంఘ నేత ప్రొఫెసర్ హరగోపాల్, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సహా పలువురు రాజకీయ పార్టీల నేతలు ప్రజాసంఘాల వారు కూడా వచ్చారు.


తెలంగాణా ఉద్యమంలో కీలకంగా ఉన్న ప్రోఫెసర్ కోదండరాం రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరక్కూడదన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం జరిగి తీరాలన్నారు. ప్రభుత్వం మారితే రాజధాని మార్చటమేంటని మరో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. అయితే ఎన్ని రోజులు పోరాడినా సర్కారు మారేంత వరకూ ఏ ఫలితం ఉండదని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: