గతంలో పవన్ కల్యాణ్ తో దోస్తీ చేసిన కమ్యూనిస్టులు అదే పవన్ కల్యాణ్ అంటే మండిపడుతున్నారు. బీజేపీ వైపు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. అసలు పవన్ ప్రత్యకత ఏంటని.. సీపీఎం నేత మధు ప్రశ్నించారు. జనసేన ఒక ప్రజా స్వామ్య పార్టీ గా ప్రజా సమస్యలు కోసం మాట్లాడటం మానేసి ఎన్నికల సందర్భం లేకుండానే ఎన్నికలు, పొత్తులు అంటూ రాజకీయం చేయడం సరి కాదని సీపీఎం మధు హితవు పలికారు
బిజెపి, జనసేన, టీడీపీ పొత్తులు అంటూ పవన్ కల్యాణ్ చర్చలకు దారి తీశారని.. పవన్ రాజకీయంలో కోసం ఆలోచన మాని ప్రజా సమస్యలు పై పోరాటం చేయాలని సీపీఎం నేత మధు సూచించారు. వైసీపీ, బిజెపి కలిసి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీలు ఇవ్వకుండా మోసం చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నారని సీపీఎం నేత మధు ధ్వజమెత్తారు.