ఏపీ సీఐడీ ఆ విషయంలో అత్యుత్సాహం చూపుతోందా?

Chakravarthi Kalyan
టీడీపీ కార్యకర్తలపై ఏపీ సీఐడీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. అక్రమ కేసులు నమోదు చేస్తూ విచారణ పేరుతో వేధిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సి.ఐ.డి అదనపు డి.జి.పికి లేఖ రాశారు. సీఐడీ సిబ్బంది తరచూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని... తెలిపారు. ఐటిడిపి సమన్వయకర్త వెంకటేష్‌ను  సిఐడి కార్యాలయానికి పిలిచి విచారణ పేరుతో అసభ్య పదజాలంతో దుర్భాషలాడి హింసించారని వర్ల రామయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  సి.ఐ.డి హెడ్ కానిస్టేబుల్ లోవరాజు, ఒక సోషల్ మీడియా పోస్ట్ ఫార్వార్డ్ విషయంలో నారా లోకేష్ చేసినట్లు ఒప్పుకోవాలని వెంకటేష్‌ను ఒత్తిడి చేసి బెదిరించారని వర్ల రామయ్య తెలిపారు.


గతంలో కూడా సి. ఐ. డి ఆఫీసు లో ముఖ్య నాయకులను విచారించే సమయంలో హెడ్ కానిస్టేబుల్ లోవరాజు అదనపు డీజీపీ సునీల్ కుమార్ తరపున విచారణ చేసేవారని వర్ల రామయ్య అంటున్నారు. విచారణ సమయంలో సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ లోవరాజు అత్యుత్సాహం ప్రదర్శిస్తారని వర్ల రామయ్య అంటున్నారు. సిఐడి అదనపు డిజిపి తమ అధికారులు చట్ట నిబంధనలకు అతీతంగా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: