బాబోయ్.. ఇన్ని రైల్వే సర్వీసులు రద్దయ్యాయా?
19వందలకుపైగా సర్వీసులను బొగ్గు సరఫరా కోసమే రద్దు చేశారట. గత 3నెలల్లోనే ఈ సర్వీసులు నిలిపి వేసింది. మరి ఈ సమాచారం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. ఒకాయన ఆర్టీఐ చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ ఈ మేరకు ఇలా సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇక నిర్వహణ లేదా నిర్మాణ పనుల కోసం కూడా పలు సర్వీసులు ఈ ఏడాది రద్దయ్యాయి. అలా రద్దైనవి 6,995 సర్వీసులు. అలాగే మార్చి నుంచి మే వరకు బొగ్గు సరఫరా కోసం 1934 సర్వీసులను రద్దు చేసిందట. దేశంలో తీవ్రమైన విద్యుత్తు కొరత ఉన్నందున ప్యాసింజర్ సర్వీసుల కంటే బొగ్గు సరఫరాకు రైల్వే శాఖ ప్రాధాన్యం ఇస్తోంది. అయితే.. అసలే వేసవి కదా.. అందుకే దేశవ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలపై ఈ రైలు సర్వీసుల రద్దు ప్రభావం బాగా పడింది మరి.