ఐక్యరాజ్య సమితి ఇండియాను హెచ్చరించింది. తీవ్రవాదం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. అఫ్గాన్‌లో పాక్ ఉగ్రవాద సంస్థలు శిక్షణ పొందుతున్నాయని.. అవి ఇండియాను లక్ష్యంగా చేసుకుంటాయని.. ఈ విషయంలో భారత్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐరాస సూచించింది. 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని అఫ్గాన్‌లో ట్రైనింగ్ క్యాంపులు జరుగుతున్నాయట. జైషే మహ్మద్ , లష్కరే తొయిబా వంటి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు అఫ్గానిస్థాన్‌లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయట. అఫ్గాన్ ప్రావిన్సుల్లో పాక్‌కు ఉగ్రవాద సంస్థల శిక్షణ శిబిరాలు సాగుతున్నట్లు ఐక్య రాజ్య సమితి తన తాజా నివేదికలో వివరించింది. అందుకే భారత్ సహా పలు ప్రభావిత దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. అఫ్గాన్‌లో బలహీనపడున్న అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్.. మళ్లీ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ ఐక్య రాజ్య సమితి నివేదిక చెబుతోంది.