హడలెత్తిస్తున్న మంకీపాక్స్.. చిన్న గుడ్‌న్యూస్?
ఓ చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే.. మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్ హెల్త్‌కేర్..ఈ మంకీ పాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీ పీసీఆర్ కిట్‌ను రూపొందించింది. ఈ కిట్‌లో నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారితంగా వ్యాధి నిర్థరణ చేస్తారు. ఈ కిట్ లో వన్ ట్యూబ్ సింగిల్ రియాక్షన్ ఫార్మాట్‌లో స్మాల్ పాక్స్, మంకీపాక్స్ తేడాను గుర్తిస్తుందట. కేవలం గంటలో ఫలితం తెలుసుకోవచ్చట.
ఇక మంకీ పాక్స్ సోకినవారిలో ఎక్కువగా జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటున్నాయి. చలి, అలసట వంటి లక్షణాలు కూడా ఉంటున్నాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ముఖం, చేతులపై దద్దుర్లు, చిన్నబొబ్బలు ఏర్పడతాయి. ఇవి క్రమేపి ఇతర శరీరభాగాలకూ వ్యాపిస్తాయి.