"నారా" అంటే కొత్త అర్థం చెప్పేశారుగా..?

Chakravarthi Kalyan
నారా అన్నది ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటి పేరు అన్న సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు అంటేనే విరుచుకుపడే వైసీపీ నేత విజయ సాయి రెడ్డి ఇప్పుడు అదే నారా పదానికి కొత్త అర్థం చెబుతున్నారు. చంద్రబాబు నాసి రకం రాజకీయనాయకుడు  అని విమర్శించడం కోసం నారా పదానికి ఎబ్రివేషన్ తయారు చేశారు. నా అంటే నాసి రకం అట అలాగే  రా అంటే రాజకీయ నాయకుడు అట. అంటే చంద్రబాబు నాసిరకం రాజకీయ నాయకుడు అని విజయ సాయి రెడ్డి చెబుతున్నారు. అందుకే చంద్రబాబు నాసిరకం రాజకీయ నాయకుడు అని ఆయన పేరులోనే ఉందని విజయ సాయి రెడ్డి అంటున్నారు. చంద్రబాబును ఏపీ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని... చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అర్హత కూడా లేదని.. అందుకే ఆయనను ఇక్కణ్నుంచి తరిమి కొడితే తప్ప ఏపీ రాష్ట్రానికి భవిష్యత్తు లేదని కొత్త సూత్రీకరణ చెబుతున్నారు విజయ సాయి రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: