గుడ్ న్యూస్.. పోలీస్ జాబ్స్ డిటైల్స్ ఇవిగో?
వీటిలో సివిల్ ఎస్సై పోస్టులు 541, సివిల్ కానిస్టేబుళ్లు 14881 పోస్టులు, ఎస్పీఎఫ్ ఎస్సై 12, కానిస్టేబుల్ 390, అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 26 పోస్టులు, పైర్ మెన్ 610 పోస్టులు, జైళ్లశాఖలో డిప్యూటీ వార్డర్ 8, వార్డర్లు 146, రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్ పోస్టులు, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.
ఈ అన్ని పోస్టులకు వచ్చే 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 20వ తేదీ రాత్రి 10గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. www.tslprb.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.