ఏపీలో ఇవాళ్టి నుంచే ఆ పరీక్షలు?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది ఏపీలో 6,22,537 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షల కోసం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది హాల్‌ టికెట్లపై ప్రిన్సిపల్‌ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతి ఇస్తామని బోర్టు ప్రకటించింది. వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు వెళ్లేవారికి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సదుపాయం కూడా కల్పించారు. విద్యార్థులు తమ హాల్ టికట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పరీక్షల కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండాకాలం కావడం వల్ల తగినంత శ్రద్ధ తీసుకోకపోతే.. దాని ప్రభావం పరీక్ష రాసే దానిపై కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇండియా హెరాల్డ్ ఆల్ ద బెస్ట్ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ssc

సంబంధిత వార్తలు: