తిరుమలలో సినిమా పాటలు.. ఇదీ కారణం..?

Chakravarthi Kalyan

ఇటీవల తిరుమలలో ఎల్‌ఈడీ స్క్రీన్లపై ఒక్కసారిగా సినిమా పాటలు ప్రదర్శితమైన విషయం కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. టీటీడీ వైఖరిపై విమర్శలు వచ్చాయి. ఆధ్యాత్మిక వాదులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. అయితే.. అసలు ఎలా ఎందుకు జరిగిందో ఇప్పుడు టీటీడీ వివరణ ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం ఎల్‌ఈడీ తెరపై ప్రసారమైన సినిమా పాటల వివాదంపై టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. మొదట ఇది తొలుత సాంకేతిక సమస్యగా గుర్తించామని.. కానీ.. ప్రాథమిక విచారణలో బ్రాడ్‌కాస్ట్‌లో పనిచేసే ఉద్యోగి కారణంగా ఇది జరిగినట్టు విచారణలో తేలిందన్నారు. ఆ ఉద్యోగి తన స్నేహితుడిని బ్రాడ్‌కాస్ట్‌ గదిలోకి తీసుకెళ్లాడని.. అత్యవసర పనిపై వెళ్తూ స్నేహితుడిని అక్కడేఉంచారని.. ఉద్యోగి స్నేహితుడు రిమోట్‌తో ఆపరేట్‌ చేయడంతో ఇలా జరిగిందని ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. ఇది ప్రాధమిక విచారణ అని.. పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: