ఉక్రెయిన్‌ యుద్ధం: అక్కడ 1500 మంది రష్యా సైనికుల శవాలు?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓవైపు ఉక్రెయిన్ భారీగానే నష్టపోతున్నా.. అవకాశం ఉన్న చోట తను కూడా దెబ్బ తీస్తోంది. రెండు వైపులా ప్రాణ నష్టంగా బాగానే ఉంటోంది. అయితే.. మధ్య ఉక్రెయిన్‌ ప్రాంతంలోని డ్నిప్రో నగరంలో 1500 మంది రష్యా సైనికుల మృత దేహాలు ఉన్నాయట. యుద్ధంలో మరణించిన ఈ రష్యన్ సైనికుల మృతదేహాలను మార్చురీ రిఫ్రిజిరేటర్లలో ఉంచారట. ఈ విషయాన్ని  ఆ నగర మేయర్‌ మిఖైల్‌ లెస్నెంకో వెల్లడించారు. తమ వద్ద 1500లకు పైగా రష్యా సైనికుల మృతదేహాలు ఉన్నాయని ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకూ వాటిని ఎవరూ తీసుకుపోలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా రష్యన్‌ తల్లులు వచ్చి వారి కుమారుల మృతదేహాల్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ యుద్ధంలో ఇరు వైపులా వేలాది మంది సైనికులు మృతి చెందారు. ఇంకా చెందుతున్నారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: