పాకిస్తాన్‌ ప్రధాని సంచలన నిర్ణయం..?

Chakravarthi Kalyan
పాకిస్థాన్‌ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్‌ షరీఫ్‌.. తొలిరోజునే ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలు అవుతున్న 2 వారాంతాపు సెలవులను రద్దు చేస్తున్నట్లు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. అంతే కాదు.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలను పెంచారు. ఉదయం 8 గంటలకే ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించాలని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆదేశించారు. ఆయన ఆర్డర్ వేయడమే కాదు.. స్వయంగా ఆయనే కార్యాలయానికి 2 గంటలు ముందుగానే చేరుకుని ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రజలకు సేవలందించేందుకు ఆయన ఆరు సూత్రాలను ప్రతిపాదించారు. ప్రతి ఉద్యోగి కూడా నిజాయతీ, పారదర్శకత, శ్రద్ధ, నిరంతర శ్రమ కలిగి ఉండాలన్నారు. పాలనపై తనదైన మార్కు చూపించేందుకే షెహబాజ్‌ షరీఫ్ ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఇది ప్రజలకు ఉపయోగపడితే మంచిదే.. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా అంత సులభంగా మారతారా.. చూద్దాం..పాక్‌లో ఎలా ఉంటుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: