ఇదేంది కేసీఆర్‌.. ధనిక రాష్ట్రంలో వాయిదా పద్దతిలో జీతాలా?

Chakravarthi Kalyan
తెలంగాణ ధనిక రాష్ట్రం.. ఈ మాట తెలంగాణ సీఎం నోట బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇంతటి ధనిక రాష్ట్రంలోనూ ఉద్యోగుల జీతాలకు సమస్య ఎందుకు ఎదురవుతోందని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు.. జిల్లాల వారీగా వాయిదా పద్దతిలో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారని.. ఉద్యోగుల బిల్లులను నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇదేనా ఉద్యోగ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రశ్నిస్తున్నారు.

ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పులు కుప్పగా మార్చలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల బిల్లులు అన్నీ తక్షణమే చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: