ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్ కసాయి అంటున్న బైడెన్‌?

Chakravarthi Kalyan
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి విరుచుకుపడ్డారు. పుతిన్‌ అధికారంలో ఉండకూడని కసాయి అని బైడెన్ అభివర్ణించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి వ్యూహాత్మక తప్పిదం అన్నారు బైడెన్. నాటో భూభాగంలోని ఒక అంగుళాన్ని కూడా పుతిన్ అక్రమించుకోలేరని హెచ్చరించారు. సాధారణ రష్యన్లు తమ శత్రువులు కాదని బైడెన్ అన్నారు. రష్యా పాలన మార్పు కోసం తాము ప్రయత్నించడం లేదన్న బైడెన్... పుతిన్ ఎక్కువ రోజులు అధికారంలో కొనసాగలేరని అన్నారు. రష్యాపై పోరాటం సాగిస్తున్న ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సాయం కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత సాయానికి అదనంగా మరో  వంద మిలియన్ల రక్షణసాయం అందించాలని అమెరికా భావిస్తోంది. అయితే.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం భీకరంగా జరుగుతుంటే.. అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రత్యక్షం అయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలాండ్‌లో ఉన్నారు. జోబైడెన్ ప్రస్తుతం యూరప్ పర్యటన భాగంగా పోలండ్‌లో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: