గుడ్‌న్యూస్‌: త్వరలో కరోనా బూస్టర్‌ డోస్‌?

Chakravarthi Kalyan
దేశంలో కరోనా బాగా తగ్గిపోయిందనే ఆనందం ఎక్కువ కాలం ఉండేలా లేదు. కొన్ని దేశాల్లో కరోనా కేసులు లక్షల్లో వస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కరోనా వేవ్‌ అన్నది ఒక దేశంలో మొదలైతే క్రమంగా అన్ని దేశాలకూ పాకడం గతంలో చూశాం. అందుకే ఇప్పుడు కేంద్రం దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు ఆలోచిస్తోది. ఇప్పటికే దేశంలో నూటికి 90 మంది
కరోనా టీకా తీసుకున్నారు.
అయితే.. రెండు కరోనా టీకా డోసులు తీసుకుని కూడా చాలా మందికి నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ కరోనా వేవ్ వస్తే ఏంటి పరిస్థితి అన్న ఆందోళన కనపిస్తోంది. కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరగడంతో బూస్టర్‌ డోసు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్‌ డోసు ఇచ్చేశారు. 60 ఏళ్లు పైబడిన వారికి కూడా బూస్టర్ డోసు ఇస్తున్నారు. ఇప్పుడు 18ఏళ్లు నిండిన అందరికీ.. రెండో డోసు తీసుకున్నాక 9 నెలలు లేదా 39 వారాల తర్వాత బూస్టర్ డోసు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: