సూపర్: ఇక మాస్కు తీసేయొచ్చట..?
ప్రస్తుతం రోజువారీ కరోనా కేసులు బాగా తగ్గుముఖం పడుతున్నందున మాస్కు నిబంధనలను సడలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని దిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు సంజయ్ రాయ్ తెలిపారు. గత ఏడాది భారత్‌లో తీవ్రస్థాయిలో రెండో కరోనా ఉద్ధృతి తలెత్తడం ఇప్పుడు మన బలంగా మారిందంటున్నారు నిపుణులు. ఎందుకంటే సహజసిద్ధ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్నవారికి దీర్ఘకాల రక్షణ లభించిందని.. భవిష్యత్‌లో కరోనా ఉద్ధృతి వచ్చినా అది పెను ప్రభావం చూపదని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్పే వరకూ మనం మాత్రం మాస్కు తీయకూడదండోయ్..