ట్విస్ట్‌: కువైట్‌లో సుసైడ్‌ చేసుకున్న కడపవాసి?

Chakravarthi Kalyan
కువైట్‌లో కడప జిల్లా వాసి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కువైట్‌లో హత్యానేరం మోపబడిన కడప జిల్లా వాసి వెంకటేష్‌ అక్కడ జైల్లోనే ఉరి వేసుకున్నట్టు సమాచారం వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కువైట్ లోని ఆర్దియా ప్రాంతంలో ముగ్గురు కువైటీ కుటుంబ సభ్యులను హత్య చేశాడని ఇటీవల కడప జిల్లా నుంచి అక్కడకు వెళ్లిన కడప జిల్లా వాసి వెంకటేషును కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అతనికి అక్కడి జడ్జి ఉరి శిక్ష విధించారు.
కడప జిల్లాలో ఉన్న వెంకటేశు భార్య కొన్నిరోజులుగా తన భర్త నిర్దోషి అని.. అతడి ఉరిని ఆపించాలని.. రాష్ట్రానికి రప్పించాలని మీడియాను ఆశ్రయించింది. కడప జిల్లా పోలీసు అధికారులను కూడా కలిసింది. అయితే.. తాజాగా వెంకటేశ్ సుసైడ్ చేసుకున్నట్టు వార్త వచ్చింది. తనను కస్టడీలో ఉంచిన సెంట్రల్ జైలులోని తన గదిలో రెండు వరుసల మంచానికి గుడ్డతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందించారు. వెంకటేశ్ ఆత్మహత్యపై సెంట్రల్ జైలు అధికారులు ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ ఆధారాలను అందించినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: