కల్తీసారా మరణాలపై లోకేశ్‌ నిరసన?

Chakravarthi Kalyan
జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి నాలుగు రోజుల్లో 20 మంది వరకూ చనిపోయిన ఘటనపై టీడీపీ ఆందోళన నిర్వహిస్తోంది. కల్తీసారా మరణాలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్యలేనంటూ నారా లోకేష్ ఆధ్వర్యంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తున్నారు. నకిలీ బ్రాoడ్ల బాగోతం వెలికితీయాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జగన్ గతంలో ఇచ్చిన మద్య పాన నిషేధం హామీ ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

అసెంబ్లీకి నిరసన ర్యాలీగా వచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులు.. రాష్ట్రంలో నాసిరకం మద్యం బ్రాండ్లు లభిస్తున్నాయంటూ మద్యం సీసాలతో అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. కల్తీసారా మరణాల్ని సహజమరణాలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్న టీడీపీ నేతలు.. కల్తీసారా అరికట్టి రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. జంగారెడ్డి గూడెంలో గత కొద్దిరోజులుగా నాటుసారా వల్ల చనిపోయింది 25మందేనని.. కానీ.. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వందల మంది చనిపోయారని టీడీపీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: