హైదరాబాద్‌లో కీలక కార్యక్రమంలో సీజేఐ, కేసీఆర్‌!

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో జరిగే కీలక కార్యక్రమంలో సీజేఐ ఎన్‌వీ రమణ, సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌కు వీరు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లోని ఐకియా వెనుక ఉన్న స్థలంలో ఉదయం 9 గంటలకు ఈ శంకుస్థాపన జరుగుతుంది.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సీజేఐ ఎన్‌వీ రమణ ఎప్పటి నుంచో  ప్రయత్నిస్తున్నారు. గతంలోనూ దీనికి సంబంధించి ఆయన కృషి చేశారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం, సదుపాయాలు హైదరాబాద్‌లో ఉన్నాయని ఆయన భావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో మంచి భవనం, మౌలిక వసతులు కల్పించేదుకు ముందుకొచ్చింది. అందుకే అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించే ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటును ఆయన ప్రోత్సహించారు. సీజేఐ ఎన్వీ రమణ స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో దీని గురంచి ప్రస్తావించారు. తన పదవీకాలం ముగిసేలోగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్న ఆయన ఇవాళ శంకుస్థాపనకు హాజరవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: