ఉమెన్స్ డే స్పెషల్: సెలవు ఇచ్చిన ప్రభుత్వం..?

Chakravarthi Kalyan
మార్చి 8.. ఇది ఉమెన్స్ డే.. మహిళా దినోత్సవం.. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఓ కానుక ఇచ్చింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మ‌హిళా ఉద్యోగుల‌కు ప్రభుత్వం సెల‌వు ఇచ్చేసింది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవాన్ని పుర‌స్కరించుకుని సెలవు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలోనూ ఇలాగే తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు సెలవు ఇచ్చింది. ఈ మేర‌కు మంగళవారం సెల‌వు ప్రక‌టిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ఇక అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళామణులను ప్రభుత్వం సన్మానించాలని నిర్ణయించింది. ఇవే కాకుండా మహిళా దినోత్సవం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే..ఈ సెలవును ఆప్షనల్ హాలీడే గా ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైనా మహిళలు డ్యూటీకీ వెళ్లాలనుకున్నా వెళ్లే అవకాశం ఇచ్చారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: