భారత్‌ మహాన్‌: విశాఖలో ఇవాళ అద్భుత దృశ్యం

Chakravarthi Kalyan

ఇవాళ విశాఖ సాగర తీరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఇవాళ విశాఖ తూర్పు నావికాదళం ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ ఫ్లీట్‌ రివ్యూలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొంటారు. ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌక నుంచి రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూను వీక్షిస్తారు. ఈ దేశ సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు.

ప్రతి రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒక్కసారైనా ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశ నౌకల బలం, బలగాన్ని సమీక్షించేందుకు ఈ ఫ్లీట్‌ రివ్యూ నిర్వహిస్తారు. మన దేశ చరిత్రలో ఇప్పటి వరకు భారత నౌకాదళం ఆధ్వర్యంలో 11  ఫ్లీట్ రివ్యూలు నిర్వహించారు. ఈ 12 ఫ్లీట్ రివ్యూల్లో రెండు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు కావడం విశేషం. రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత అతి ముఖ్యమైన కార్యక్రమంగా ఈ ఫ్లీట్ రివ్యూకి గుర్తింపు ఉంది. ఇవాళ విశాఖలో నిర్వహిస్తున్న ఈ ప్రెసిడెంట్‌ ఫ్లీట్ రివ్యూలో దేశానికి చెందిన 44కి పైగా నౌకలు పాల్గొంటాయి. ఈ ఫ్లీట్‌ రివ్యూలో 50కి పైగా ఎయిర్ క్రాప్టులు కూడా పాల్గొంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: