మీకోసం జైలుకు వెళ్తా.. పవన్ షాకింగ్‌ కామెంట్స్..!

Chakravarthi Kalyan
జనం కోసం తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్దమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారుల పొట్ట కొట్టే జీవో 217 గురించి ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఇలాంటి జీవో ఏ రాష్ట్రంలోనూ లేదని.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని విమర్శించారు. ప్రస్తుతం ఈ జీవోను నెల్లూరు జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని.. ఇప్పుడు జనం ప్రతిఘటించకపోతే.. ఆ తర్వాత ఏపీ మొత్తం అమలు చేస్తారని పవన్ మత్స్య కారులను హెచ్చరించారు.


ఇకనైనా గంగ పుత్రులంతా మేల్కొని.. తమకు జరగుతున్న అన్యాయం పై పోరాడాలని పవన్ పిలుపు ఇచ్చారు. ఈ దుర్మార్గపు  జీవో 217కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేసే పోరాటానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. అవసరమైతే మత్స్యకారుల కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: