ఇవాళ విశాఖకు జగన్.. రేపు కీలక కార్యక్రమం..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ ఇవాళ విశాఖపట్నం వెళ్తున్నారు. ఈ సాయంత్రం ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆహ్వానం పలకనున్నారు. ఇంతకీ రాష్ట్రపతి విశాఖకు ఎందుకు వస్తున్నారనుకుంటున్నారా.. రేపటి నుంచి విశాఖలో నావీ కార్యక్రమం ఉంది. ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూ కార్యక్రమాన్ని నౌకాదళం నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రపతి వస్తున్నారు. ఆయనకు రాష్ట్రం తరపున స్వాగతం పలికేందుకు సీఎం జగన్ విశాఖ వెళ్తున్నారు.

విశాఖలో ఈ వారం కీలక కార్యక్రమాలు ఉన్నాయి. రేపటి నుంచి ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించబోతున్నారు. దీని కోసం ఇప్పటికే పూర్తిస్థాయిలో నౌకాదళం రిహార్సల్స్ నిర్వహిస్తోంది. ఆర్కే బీచ్‌లో ఈ రిహార్సల్స్ తో సందడి వాతావరణం నెలకొంది. ఈ ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూ కోసం ఏర్పాటు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 55 ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొంటాయి. మరో 60 యుద్ధనౌకలు నౌకాదళం, కోస్ట్ గార్డ్, ఓషనోగ్రఫీ లకు చెందిన నౌకలు కూడా పాల్గొంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: