గుంటూరు జిల్లాలో ఇవాళ సీఎం జగన్ అతి పెద్ద గోకుల క్షేత్రానికి భూమి పూజ నిర్వహించనున్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్.. ఆత్మకూరులో సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించనున్నారు. ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా పేదలకు ఆహారం అందిస్తారు.ఈ అత్యాధునిక వంటశాలను ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తోంది. అలాగే.. కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రానికి ఇవాళ సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. రూ.70 కోట్లతో రాష్ట్రంలోనే అతి పెద్ద గోకుల క్షేత్రాన్ని ఇస్కాన్ నిర్వహిస్తోంది. ఇస్కాన్ దేశంలోనే కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే సంస్థ.. ఈ సంస్థ రాష్ట్రంలో అనేక దేవాలయాలు, సేవా సంస్థలు నిర్వహిస్తోంది. ఇస్కాన్ ఫౌండేషన్ తెలంగాణలోనూ అక్షయ పాత్ర ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రూ.5 లకే భోజనం పథకాన్ని ఈ సంస్థే ప్రారంభించింది. ఇది ఇప్పుడు లక్షల మందికి రూ.5 లకే భోజనం అందిస్తోంది.