టీపీసీసీ బాస్ మరోవివాదంలో చిక్కుకున్నారు.కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా నేతృత్వంలో నిరసనలు వ్యక్తం అయ్యాయి.టీఆర్ఎస్ ఐటీ సెల్ నిర్వాహకులు కూడా భాగం పంచుకుని రేవంత్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టన నినాదాలు చేస్తూ పిండ ప్రదానం చేశారు.ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ కేసీఆర్ ను దృష్టిలో ఉంచుకుని దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.కాంగ్రెస్ యువ నేత రాహుల్ పుట్టుకను ఉద్దేశించి అత్యంత దిగజారుడు రీతిలో మాటలు మాట్లాడిన బీజేపీనే ఎదిరించిన నేత కేసీఆర్ అని అన్నారు.ఇప్పటికీ చంద్రబాబు మాటలకు అనుగుణంగా పనిచేస్తున్న రేవంత్ ఇప్పటికైనా ఆ బానిస సంకెళ్లు తెంచుకుని రావాలి అని కోరారు.తొలుత రేవంత్ చిత్రపటానికి పూల మాలలు వేసి పిండ ప్రదానం చేసిన అనంతరం సంబంధిత పిండాలను మూసీ నదిలో జార విడిచారు. కార్యక్రమానికి టీఆర్ఎస్ ఐటీ సెల్ నిర్వాహకులు సతీశ్ రెడ్డి నేతృత్వం వహించారు.