పోలింగ్‌ డే: ఉత్తరాఖండ్‌, గోవాలను బీజేపీ నిలబెట్టుకుంటుందా..?

Chakravarthi Kalyan
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇవాళ రెండో అంకం మొదలైంది. ఇవాళ ఉత్తరాఖండ్‌, గోవా, ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లో ఒక దశ ఎన్నికలు ముగియగా ఇవాళ జరుగుతున్నవి రెండో దశ ఎన్నికలు.. ఇక ఉత్తరాఖండ్‌, గోవాలో ఇవాళ ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌లో రెండో విడత కింద మొత్తం తొమ్మిది జిల్లాల్లో పోలింగ్‌ జరగబోతోంది.


ఉత్తర ప్రదేశ్‌లో 55 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. ఇక గోవా అసెంబ్లీ విషయానికి వస్తే అక్కడ 40 స్థానాలకు పోలింగ్‌ జరగబోతోంది. ఉత్తరాఖండ్‌, గోవా, యూపీ.. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలను నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఉత్తరాఖండ్‌, గోవాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ఆప్‌ కూడా బరిలో నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: