అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌: మనోళ్లు కప్‌ కొడతారా..?

Chakravarthi Kalyan
ప్రపంచ క్రికెట్‌లో ఇవాళ భారత్‌కు కీలకమైన రోజు.. మన కుర్రాళ్లు ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఇవాళ ఇంగ్లాండ్‌తో తలపడనున్నారు. ఈ సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కాబోతోంది. అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక టైటిళ్లు నెగ్గిన భారత్‌.. ఇవాళ కూడా కప్ గెలుచుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే యువ భారత ఆటగాళ్లు అత్యధికంగా నాలుగు సార్లు ప్రపంచ కప్‌ గెలిచారు.


ఇక ఇంగ్లాండ్‌ విషయానికి వస్తే.. ఈ జట్టు రెండో సారి ప్రపంచకప్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ ప్రపంచ కప్‌ పోటీల్లో భారత్‌ గ్రూప్‌ బీలో ఉంది. గ్రూప్‌- బి మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాపై 45 పరుగుల తేడాతో భారత్‌ గెలిచింది. తర్వాత ఐర్లాండ్‌పై 174 పరుగుల తేడాతో, ఉగాండాపై 326 పరుగుల తేడాతో విజయాలు సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. టీమిండీయా క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 96 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: