ఇలాగైతేనే ఓకే.. మంత్రులకు తేల్చి చెప్పిన ఉద్యోగులు..?

Chakravarthi Kalyan
చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడంతో ఏపీ ప్రభుత్వం కాస్త దిగొచ్చింది. ఉద్యోగ సంఘ నేతలతో మంత్రుల కమిటీ చర్చిస్తోంది. అయితే.. ఈ చర్చల్లో తమ డిమాండ్లను ఉద్యోగులు మరోసారి వినిపించారు. మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘాలు కొన్నిప్రతిపాదనలు పెట్టాయి.


వాటిలో మొదటిది.. పీఆర్సీ నివేదిక  బయట పెట్టాలి.. రెండోది.. ఫిట్ మెంట్ 30% ఇవ్వాలి.. అంత ఇవ్వలేమంటే కనీసం 27కు తగ్గకుండా ఇవ్వాలి. మూడో డిమాండ్..  హెచ్ ఆర్ ఏ స్లాబ్ రేట్లు పాతవే కొనసాగించాలి. నాలుగో డిమాండ్‌.. సిటీ కంపన్సేటరీ అలవెన్సును కొనసాగించాలి.. ఐదో డిమాండ్‌ పెన్షనర్ లకు అడిషనల్ క్వాంటమ్ కింద 70 ఏళ్లవారికి 10%, 75 ఏళ్లవారికి 15% కొనసాగించాలి. మట్టి ఖర్చులకు రూ. 20,000 లేదా ఒక నెల పెన్షన్ ఇవ్వాలి.. ఏడోది. కాంట్రాక్టు ఉద్యోగులకు పే, డి ఏ, హెచ్ ఆర్ ఏ, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.


ఎనిమిదోది.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు  మినిమమ్ టైం స్కెలు ఇవ్వాలి. తొమ్మిదోది.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ నుండి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలి.. 2022 పీఆర్సీ స్కెల్ లు ఇవ్వాలి.. పదో డిమాండ్.. మార్చి 31 లోగా సీపీఎస్ రద్దు పై నిర్ణయం తీసుకోవాలి.. పదకొండో డిమాండ్‌.. రాష్ట్ర పీఆర్సీ నే కొనసాగించాలి. ఇవీ ఉద్యోగ సంఘాల డిమాండ్లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: