చలో బెజవాడ: 100సీసీ కెమేరాలు.. ఖాకీల వ్యూహం ఇదీ..?

Chakravarthi Kalyan
ఏపీ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. పీఆర్సీ సాధన సమితి చేపట్టిన ఛలో విజయవాడ కు అనుమతి లేదన్నారు. ఉద్యోగులు ఎవరూ బీఆర్టీఎస్ రోడ్డుకు రావొద్దని తెలిపారు. ఈ మేరకు అక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. బీఆర్టీఎస్ రోడ్డులో ప్రత్యేకంగా 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  ఓ ఫాల్కనో వాహనం, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

 

మీసాల రాజరావు వంతెన నుంచి భాను జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించాలని పీఆర్సీ సాధన సమితి ప్లాన్ చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం నిర్వహించాలని భావిస్తోంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో వాహన రాక పోకలు అనుమతించబోమని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: