శభాష్‌ శ్రీజేష్‌: మనోడికి వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌..?

Chakravarthi Kalyan
హాకీ.. ఒకప్పుడు ఇండియాకు బంగారు పతకాల పంట  పండించిన క్రీడ.. మళ్లీ ఇప్పుడిప్పుడే ఇండియా హాకీకి మంచిరోజులు వస్తున్నాయి. తాజాగా భారత పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్  శ్రీజేష్ ను ఓ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. వరల్డ్  గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును
శ్రీజేష్‌ దక్కించుకున్నాడు. ఇండియా నుంచి ఈ వరల్డ్  గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న రెండో భారతీయుడిగా శ్రీజేష్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు మహిళల హాకీ జట్టు కెప్టెన్  రాణి రాంపాల్ ఈ అవార్డు అందుకుంది.  

శ్రీజేష్ గతేడాది ఎఫ్ఐహెచ్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పటి వరకు కెరీర్ లో శ్రీజేష్ మూడు సార్లు ఒలింపిక్స్ కు వెళ్లాడు. శ్రీజేషన్ ఇప్పటి వరకూ దాదాపు 240కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు కాంస్యం సాధించడంలో శ్రీజేష్‌ కీలక పాత్ర పోషించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: