బ్రేకింగ : నేల కూలిన మరో మిగ్-21


భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం శుక్రవారం రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో కూలిపోయిందని సీనియర్ పోలీసు అధికారి  పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. పైలట్ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం తాలూకు వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెజర్ట్ నేషనల్ పార్క్ ప్రాంతంలో విమానం కూలిపోయిందని జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్  వార్తా సంస్థకు తెలిపారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని,  తాను కూడా ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ వార్తను ధృవీకరిస్తూ, వైమానిక దళం రాత్రి  ట్వీట్ చేసింది, "ఈ సాయంత్రం, రాత్రి 8:30 గంటల సమయంలో,   ఐఏఎఫ్  కు చెందిన మిగ్-21  విమానం శిక్షణ సమయంలో పశ్చిమ సెక్టార్‌లో ఎగిరే  సమయంలో ప్రమాదానికి గురైంది. మరిన్ని వివరాలు  అందవలసి ఉంది. విచారణకు ఆదేశించాం అని ట్విటర్ లో పేర్కోన్నారు.
ఈ ఏడాది లోనే  పలు మిగ్-21  విమానాలు  క్రాష్‌లు నమోదయ్యాయి. క్రాష్‌ల గురించి తరచుగా వార్తలు వెలు వడుతున్నందున  ఈ విమానానికి "ఎగిరే శవపేటిక" అని పేరు పెట్టారు. 1971 నుంచి ఏప్రిల్ 2012 వరకు, 482 మిగ్ విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి, 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు, ఎనిమిది మంది సైనిక సిబ్బంది తో పాటు  ఒక ఎయిర్‌క్రూ మరణించారు, ఈ వివరాలన్నీ ప్రభుత్వం మే 2012లో పార్లమెంటుకు తెలిపింది. "ప్రమాదాలకు కారణాలు రెండూ మానవ తప్పిదాలే. మరియు సాంకేతిక లోపాలు" అని ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: