ఆపద్భాంధవుడికి ఐదు కిలోల బంగారు కానుకలు


ఆపద్భాంధవుడిగా భక్తుల మన్ననలు పొందుతున్న తిరుమల వేంకటేశ్వర స్వామికి అజ్ఞాత భక్తుడు  కెంపులు, వజ్రాలు పొదిగిన బంగారు అభరణాలను కానుకగా ఇచ్చారు. ఈ అజ్ఞాత భక్తులు ఎక్కడ వీటిని  స్వామివారికి సమర్పించారంటే...
తిరుమలలో కొలువై యున్న శ్రీనివాస ప్రభువుకు ఎందరెందరో భక్తులు తమ శక్తి కొలది కానుకలు సమర్పిస్తుంటారు. మరికొందరు స్వామివారికి తలనీలాసు సమర్పిస్తారు. ఇంకొందరు దాతలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న ట్రస్టులకు ఇస్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఖజానా ఉన్న బంగారు ఆభరణాలు ఎన్నో.. ఎన్నెన్నో.. తాజాగా ఏడుకొండల వేంకటేశ్వరునికి ఓ అజ్ఞాత భక్తుడు ఐదు కిలోలకు  పైగా బరువు గల బంగారాన్ని స్వామి వారికి కానుకగా ఇచ్చారు. స్వామి వారికి వరద - కటి హస్తాలను కెంపులు, వజ్రాలతో చేయించారు. వాటి విలువ దాదాపు మూడు కోట్ల రూపాయల పైచిలుకు ఉంటుందని టిటిడి అధికారులు తెలిపారు. ఈ భక్కుడు తాను చేయించిన బంగారు ఆభరణాలను దేవాలయంలోని రంగ నాయక మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ఇంత భారీ బహుమతిని స్వామివారికి అందజేసిన భక్తుడు తన పేరును వెల్లడించ వద్దని టిటిడి అధికారులను కోరడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: