జల వివాదం తర్వాత తొలిసారి.. పెళ్లిలో కలిసిన కేసీఆర్‌, జ‌గ‌న్

N ANJANEYULU
తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మ‌ళ్లీ క‌లిసారు. జ‌ల వివాదాల త‌రువాత తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్ద‌రూ ఒకే వేదిక‌పై క‌నిపించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చొని కాసేపు క‌బుర్లు చెప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి మ‌న‌వ‌రాలు స్నిగ్దారెడ్డి పెళ్లి వేడుక వేదిక అయింది. శంషాబాద్ కొత్త‌గూడ‌లో వీఎన్ఆర్ ఫామ్స్‌లో ఆదివారం అంగ‌రంగ‌వైభ‌వంగా స్నిగ్దారెడ్డి వివాహం జ‌రిపించారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ వ‌ద్ద ప్ర‌త్యేకాధికారిగా ప‌ని చేస్తున్న కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి కుమారుడైన రోహిత్‌రెడ్డితో స్నిగ్దారెడ్డి మూడు ముళ్లు వేయించుకుంది. ఏపీ నుంచి సీఎం జ‌గ‌న్‌తో పాటు స్పీక‌ర్ త‌మ్మినేని, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ‌వాణి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఇక హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఈ పెళ్లి వేడుక‌లో పాల్గొన్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌తో పాటు వైఎస్ విజ‌య‌ల‌క్ష్మీ కూడా పెళ్లికి హాజ‌ర‌వ్వ‌డం విశేషం. తెలంగాణ‌, ఏపీ సీఎంల‌తో పాటు గ‌వ‌ర్న‌ర్‌, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు  ప‌లువురు ఈ పెళ్లిలో  సంద‌డి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: