అదరగొడుతున్న రాధేశ్యాం ఫస్ట్ సింగిల్..
ఎంతో భారీ బడ్జెట్ మూవీగా యూవీ క్రియేషన్స్ ఇంకా టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ ఇంకా ప్రభాస్ సోదరి ప్రసీద సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే.. ఇక తాజాగా ఈ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓ బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది."ఈ రాతలే" అనే లిరిక్స్ తో స్టార్ట్ అయ్యే.. ఫుల్ సాంగ్ ను చిత్ర బృందం కాసేపటి క్రితమే యూ ట్యూబ్ లో విడుదల చేసింది. ఇక సాయంత్రం నుంచి ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఆసక్తి గా ఇంకా ఆతృతగా ఈ సాంగ్ కోసం ఎదురు చూశారు. కొన్ని అనివార్య కారణాల వలన పాటని అనుకున్న సమయానికి విడుదల చేయలేదు చిత్ర బృందం. ఇక ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంటూ ఆదరగోడుతుంది.
https://youtu.be/vHuBCcm7KC8