కేసీఆర్ Vs ఈటెల : అల్లుడ్ని పంపేస్తాడ్రా!

RATNA KISHORE
తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ కు అల్లుడి గండం ఉన్న విధంగానే కేసీఆర్ కు కూడా అల్లుడి గండం ఉంది. తెలు గుదేశం పార్టీ నుంచి వ‌చ్చిన నేత‌గా పేరున్న కేసీఆర్ కు అల్లుడి గండం త‌ప్పేలా లేదు. ఆ అల్లుడి పేరు హ‌రీశ్ రావు. నిన్న‌టి హుజురాబాద్ లోనూ, మొన్న‌టి దుబ్బాక‌లోనూ ఆయ‌నే అంతా అయి క‌థ న‌డిపారు. దుబ్బాక లో కేసీఆర్ మ‌రో అల్లుడు ర‌ఘు నంద‌న్ గెలిచాడు. అప్పుడు హ‌రీశ్ ఓడిపోయాడు. టీఆర్ ఎస్ గూటి నుంచి బీజేపీ గూటికి చేరుకున్న ర‌ఘు నంద‌న్ మంచి విజ‌య‌మే సాధించి మామ పై మాట పై పై చేయి సాధించాడు. ప‌ట్టు సాధించాడు. త‌రువాత అసెంబ్లీలో మామ‌ను ఉద్దేశించే చాలా మాట‌లు చెప్పి ఆయ‌న ఆశీర్వాదాల‌తోనే ఈ మాట‌లు చెబుతున్నా అంటూ అసెంబ్లీలో ప్ర‌సంగం ఒక‌టి ఈ మ‌ధ్య వినిపించాడు. వీటి తీరు ఎలా ఉన్నా ఇప్పుడు హుజురాబాద్ లో క‌నుక గెల్లు ఓడిపోతే హ‌రీశ్ రావుపై వేటు త‌ప్ప‌దు. ఈటెల మాదిరిగానే హ‌రీశ్ కు ప‌రాభ‌వం త‌ప్ప‌దు. అందుకు హ‌రీశ్ ఇప్ప‌టి నుంచి సిద్ధం అయిపోతే మంచిది! అందుకే ముందునుంచే హ‌రీశ్ రావు త‌నకంటూ ఓ వ‌ర్గాన్ని త‌న‌దైన ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి మొద‌ట్నుంచి చేస్తూనే వ‌చ్చారు. మామ‌కు త‌గ్గ అల్లుడిగా పేరు తెచ్చుకునే క్ర‌మంలో పార్టీలో దూసుకుపోయి తెలంగాణ వాకిట స్థిర‌ప‌డిపోయారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: