గల్ఫ్ కూలీలు 15 వేలు మంది ఎక్కడున్నారో తెలియదు. ఇంకా ఇతరుల కొందరు ఎక్కడున్నారో తెలియదు. అయితే ఇదే అదును గా కొందరు రెచ్చిపోనున్నారు అని సమాచారం. వారి స్థానంలో ఓటేసి వచ్చేందుకు తెగ తహతహలాడుతున్నారని కూడా సమా చారం. అదేవిధంగా పక్క ప్రాంతాలకు పోయిన, పొరుగు దేశాలకు తరలిపోయిన వారిని ఇక్కడికి రప్పించే ఏర్పాట్లేవీ చేయలేదని ప్ర ధాన మీడియా ఆరోపిస్తుంది. ఇదే కనుక జరిగితే సమస్య ఇంతలా ఉండేది కాదని అంటున్నారు కూడా ఇంకొందరు విపక్ష సభ్యు లు. అయితే ముఖ్యమంత్రి ఆదేశాలు ఎలా ఉన్నా కూడా అధికార దుర్వినియోగం జరిగితే మాత్రం నష్టపోయేది వైసీపీనే! ఆ అపఖ్యాతి ఇక్కడి ఎన్నికల వ్యవహారం చూస్తున్న పెద్దిరెడ్డి తెచ్చుకుంటాడో లేదో కానీ అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉంటేనే మేలు. ఇక పెద్ది రెడ్డికి ఈ ఎన్నికతో పేరు వస్తుందా లేదా ఈ ఎన్నికే ఆయనకు కీడు చేస్తుందా అన్నది చూడాలిక.