ఇక నుంచి హైస్కూళ్ల పరిధిలోకి ఆ తరగతులు
ఒకే ఆవరణలో ఉన్న లేదా దాదాపు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి 3,4,5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలోకి తీసుకురావాలని ఆదేశించినది. అదేవిధంగా ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు ప్రైమరీ ఎస్టీజీతో బోధన కొనసాగించి.. సీనియర్ ఎస్జీటీలను 3,4,5 తరగతులకు బోధించే విధంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నది. ప్రాథమిక తరగతిలో విద్యార్థులను 1 20 నిష్పత్తిలో ఒక టీచర్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.