దసరా పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టం అయిన పండుగ. పిల్లా పాపలతో అందరూ చేసుకునే పండుగ. ముత్తైదువుల పండుగ. ఇంకా చెప్పాలంటే బతుకమ్మల పండుగ. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆనందోత్సాహాలతో జరుగుపుకునే ఈ పండుగ చెడుపై మంచి సాధించే విజయంకు సంకేతం. అభయానికి సంకేతం. అమ్మతనం ను పూజించే గొప్ప పండుగకు ఇదే నిదర్శనం. మనిషి ఎంతగా పతనం అయినా ప్రకృతి కాపాడుతూనే ఉంటుంది అని చెప్పేందుకు తార్కాణం ఈ పండుగ. ప్రకృతిని పూజించి, ఆరాధించే పండుగ.
ఈ పండుగ రోజు ఆయుధ పూజ అన్నది ముఖ్యం కదా! మరి! జగన్ ఆయుధ పూజ చేస్తాడా? అన్నది ఆసక్తిదాయకం. ఆయనకు న్న విశ్వాసాల రీత్యా చేస్తాడో చేయడో కానీ రాష్ట్ర ప్రజల అభిమతం కోరి నాలుగు మంచి పనులు చేస్తే అదే మేలు. పండుగ వేళ రాష్ట్ర ప్రజలంతా కోరుకునేది ఇదొక్కటే! అవసరానికి మించి అప్పులు చేయడం మానుకోండి సర్ ప్లీజ్ ! ఇదొక్కటే మా వినతి మరియు విన్నపం కూడా !